Published on Nov 16, 2024 3:59 PM IST
తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం నయనతార్ పోస్ట్ చేసిన ఓ ఓపెన్ లెటర్ పెద్ద దుమారం రేపుతోంది. స్టార్ హీరో ధనుష్‌పై నయనతార పలు ఆరోపణలు చేస్తూ ఈ లెటర్‌ను తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల నయనతార జీవితంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నయనతార ఒక స్టార్ హీరోయిన్గా ఎలా ఎదిగింది అనే విషయాలను ప్రేక్షకులకు చూపెట్టారు.
అయితే, ఈ డాక్యుమెంటరీలో ఆమె నటించిన సినిమాలకు సంబంధించిన సీన్లు, మేకింగ్ సీన్స్ వంటివి కూడా ఉన్నాయి. ఇక్కడే అసలు సమస్య వచ్చినట్లు నయనతార తన లెటర్లో పేర్కొంది. ‘నానుమ్ రౌడీ ధాన్’(తెలుగులో నేనూ రౌడీ నే) అనే సినిమాను ధనుష్ ప్రొడ్యూస్ చేయగా విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా విషయంలో నయనతార, ధనుష్‌ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాలోని ఓ మేకింగ్ సీన్ నయనతార డాక్యుమెంటరీలో దర్శనమిచ్చింది.
ఈ డాక్యుమెంటరీలో తన సినిమాకు సంబంధించి ఎలాంటి సీన్స్ ఉండకూడదని గతంలోనే ధనుష్ కండీషన్ పెట్టడంతో మేకర్స్ అలాంటివేమీ లేకుండా జాగ్రత్త పడ్డారు. దీనికోసం ధనుష్ వారిని కొంతకాలం వెయిట్ కూడా చేయించాడు. ఎట్టకేలకు వారికి ధనుష్ నుండి NOC కూడా లభించడంతో వారు తమ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. కానీ, ఇప్పుడు ఇందులోని 3 సెకన్ల మేకింగ్ సీన్ కనిపించడంతో ధనుష్, ఈ డాక్యుమెంటరీ మేకర్స్ నుండి రూ.10 కోట్లు నష్టపరిహారంగా డిమాండ్ చేస్తున్నాడు.
ఇదే విషయంపై నయనతార మండిపడుతూ ఓపెన్ లెటర్ రాసుకొచ్చింది. ధనుష్ లాంటి యాక్టర్స్ స్వయంకృషితో ఎదిగిన తనలాంటి హీరోయిన్లను చాలా చిన్నచూపు చూస్తున్నారని.. తమిళ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ధనుష్ గురించి చెడుగా చెబుతున్నా, తాను పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు ఇలా తన చీప్ బిహేవియర్‌తో ఆయన తన బుద్ధిని చాటాడని.. ఈ విషయాన్ని లీగల్‌గానే తేల్చుకుంటామని నయనతార షాకింగ్ విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ధనుష్-నయనతారల వ్యవహారం కోలీవుడ్‌ను షేక్ చేస్తోంది.