NBK 109 : ‘డాకు మహారాజ్’ ఫస్ట్ లిరికల్ సాంగ్.. ఫ్యాన్స్ కు పూనకాలే.!

  • బాలయ్య 109వ సినిమాగా డాకు మహారాజ్
  • దర్శకత్వం వహించిన బాబీ
  • సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 109వ సినిమాగా ‘డాకు మహారాజ్’ లో నటిస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటరైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, హీరోయిన్స్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరి కీలక పాత్రలో నటిస్తోంది. హై అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌ ఆడీయన్స్ లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Also Read : pushpa 2 : ఓవర్సీస్ లో మైల్ స్టోన్ మార్క్ అందుకున్న పుష్ప రాజ్

కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అందులో భాగంగా ఈడాకు మహారాజ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాంగ్ రిలీజ్ డేట్ ఎప్పడనేది ప్రకటించకుండా డాకు ఫస్ట్ సింగిల్ అదరగొడుతుంది, బ్లాక్ బస్టర్ తమన్, బాలయ్య కాంబో మరోసారి సెన్సేషన్ చేయడానికి వస్తున్నారు అని మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 15 తర్వాత సాంగ్ రిలీజ్ చేస్తారు అనే టాక్ వినిపిస్తుంది. బాలయ్య సినిమాలకు తమన్ సంగీతం అందించిన అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో డాకు అంతకు మించి ఉంటుందని యూనిట్ భావిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *