Published on Jan 2, 2025 11:01 AM IST
దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కి వరల్డ్ వైడ్ గా ఎలాంటి పాపులార్టీ ఉందో అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ గా మరోసారి నెట్ ఫ్లిక్స్ షో స్క్విడ్ గేమ్ సీజన్ 2 తో మరోసారి ఓ రేంజ్ లో వినిపించడం మొదలైంది. అయితే మంచి క్వాలిటీతో కూడిన ఓటిటి కంటెంట్ తో నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు వరకు ఎన్నో షోస్ సినిమాలతో అలరించగా ఈ 2025లో కూడా క్రేజీ ట్రీట్ ని అందించే దిశగా ఇపుడు వస్తుంది.
మరి లేటెస్ట్ గా ఈ 2025 లోనే స్క్విడ్ గేమ్ సీజన్ 3 ని కన్ఫర్మ్ చేయగా దీనితో పాటుగా మరో రెండు అవైటెడ్ వెబ్ సిరీస్ లు సీక్వెల్స్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. అవే “వెడ్నెస్ డే 2” (Wednesday season 2) అలాగే “స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5” (Stranger Things 5). ఈ రెదను అవైటెడ్ సీక్వెల్ సీజన్లు కూడా ఇదే ఏడాదిలో రానుండగా వీటితో పాటుగా పలు సినిమాలను కూడా విడుదల చేయనున్నారు. ఇలా మొత్తానికి అయితే నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ ఏడాది లోనే తమ వీక్షకులకు మంచి ట్రీట్ ని అందించనుంది అని చెప్పాలి.
Squid Game
Wednesday
Stranger Things2025 is going to be big. pic.twitter.com/0K72WWQFYc
— Netflix (@netflix) January 1, 2025