Netizens React to Rajamouli & Rashmi Clip
Netizens React to Rajamouli & Rashmi Clip

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వరుస బ్లాక్‌బస్టర్లతో భారతీయ సినిమా పరిశ్రమలో తిరుగులేని దర్శకుడిగా ఎదిగాడు. బాహుబలితో దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకి గుర్తింపు తీసుకొచ్చిన రాజమౌళి, తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ సెన్సేషన్ అయ్యాడు. ఈ సినిమా ఆస్కార్ గెలుచుకోవడం ద్వారా ప్రపంచ దృష్టిని తెలుగు చిత్రసీమ వైపు మళ్లించాడు. ప్రస్తుతం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ పాన్-ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు.

అయితే, తాజాగా రాజమౌళికి సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యాంకర్ రష్మీతో రాజమౌళి ఫన్నీగా కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యపరచింది. ఈ సన్నివేశంలో రాజమౌళి రష్మీకి సైట్ వేయడం, రష్మీ అందుకు స్పందించడం నెటిజన్లలో ఉత్సాహాన్ని పెంచింది. ఈ వీడియో ఎప్పుడుందో అని పరిశీలిస్తే, ఇది విక్రమార్కుడు సినిమా సమయంలో తీసినదిగా తెలుస్తోంది. అప్పట్లో ప్రసారమైన “యువ” సీరియల్లో రష్మీ ప్రధాన పాత్రలో నటించగా, రాజమౌళి అతిథిగా ప్రత్యక్షమయ్యారు.

ఈ వీడియోపై నెటిజన్లు వెరైటీ రియాక్షన్స్ ఇస్తూ, ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోన్న ఈ వీడియోపై అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా, మహేష్ బాబు, రాజమౌళి సినిమా అఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ అని సమాచారం. ఈ సినిమాలో మహేష్ కంప్లీట్లీ డిఫరెంట్ లుక్లో కనిపించనుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి.

https://twitter.com/MawaNuvvuThopu/status/1891898334400414053

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *