- ఫ్యామిలీ ఇష్యూలతో మోహన్ బాబు
- ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఔట్
- హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ
దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న నాని.. ఓన్ ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమాపై బ్లాక్ బస్టర్ సిరీస్ హిట్ 3లో యాక్ట్ చేస్తున్నాడు. నెక్ట్స్ ఇయర్ మే 1కు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. తన నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేశాడు. దసరాతో మాస్ ఇమేజ్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో ద ప్యారడైజ్‌కు కమిటయ్యాడు న్యాచురల్ స్టార్. మోస్ట్ వయలెంట్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. నా నెక్ట్స్ సినిమాకు పిల్లలు దూరంగా ఉండాలని ఓ టైంలో నాని హింట్ ఇచ్చినట్లుగా ప్యారడైజ్ ఉండబోతుందని టాక్.
Also Read : Anjali : సౌత్ సినిమాలతోనే నెట్టుకొస్తున్న అంజలి
ఏడాదికి మినిమం టూ మూవీస్ చేస్తూ ఆడియన్స్‌తో రెగ్యులర్ టచ్‌లో ఉంటున్నాడు న్యాచురల్ స్టార్. నెక్ట్స్ ఇయర్ కూడా ఇదే స్కెచ్ వేసుకున్నాడు. హిట్ 3తో పాటు ప్యారడైజ్ కూడా కంప్లీట్ చేసి ఇయర్ ఎండింగ్‌కు తీసుకురావాలన్నది ప్లాన్. కానీ స్టార్టింగ్‌లోనే ట్రబుల్స్ ఫేస్ చేస్తోంది మూవీ టీం. ప్యారడైజ్‌లో మంచు మోహన్ బాబు నటిస్తున్నారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఆయన ఓకే చెప్పినట్లు కూడా టాక్. అయితే ప్రజెంట్ ఫ్యామిలీ ఇష్యూస్, పోలీస్ కేసులతో కలెక్షన్ కింగ్ సతమతమౌతున్నారు. ఇదే కాదు.. ప్యారడైజ్‌కు మరో కొత్త కష్టం కూడా వచ్చిపడినట్లు సమాచారం.
అలాగే ఈ ప్రాజెక్ట్ నుండి అనిరుధ్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనకున్న ఓల్ట్ కమిట్ మెంట్స్ కారణంగా ఈ సినిమాకు మ్యూజిక్‌కు ఇన్ టైంలో ఇవ్వలేనని ఈ సినిమా నుండి క్విట్ అయినట్లు టాక్ నడుస్తోంది. మేకర్స్ కొత్త కంపోజర్ వేటలో పడ్డారని సమాచారం.