- అనుష్క శెట్టి డైరెక్టర్ క్రిష్ కాంబోలో ‘ఘాటీ’
- సరికొత్త నేపథ్యాన్ని తీసుకున్న డైరెక్టర్ క్రిష్
- క్లైమాక్స్ చిత్రీకరణలో ఘాటీ
Ghaati Movie : అనుష్క శెట్టి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రం ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్కకు ఇది నాలుగో సినిమా. అనుష్క పుట్టినరోజును సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో అనుష్క పాత్ర స్టన్నింగ్ అండ్ రూత్ లెస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. పోస్టర్‌లో, అనుష్క తల, చేతుల నుండి రక్తం కారుతున్నట్లు కనిపిస్తుంది, ఆమె నుదిటిపై బిందీతో, బంగా స్మోక్ చేస్తూ కనిపించడం స్టన్నింగ్ గా అనిపించింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Read Also:NBK 109 : డాకు మహారాజ్ స్పెషల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే, 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్ రెడీ స్టార్ట్ అయింది. ఇక వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు డైరెక్టర్ క్రిష్. ఈ క్లైమాక్స్ షూట్ పూర్తి అయిన తర్వాత అనుష్క తన పాత్రకు డబ్బింగ్ ను కూడా పూర్తి చేయనున్నారట. ఈ క్లైమాక్స్ షూట్ ను జనవరి చివరలో తీసే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. ఇక ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత అమెజాన్ లోకి రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
Read Also:Bollywood : అమీర్ ఖాన్ ను వంశీ పైడిపల్లి మెప్పించ గలడా..?