Jailer 2 : వరుస పరాజయాల తర్వాత సూపర్ స్టార్ తన స్టామినాను నిలబెట్టిన సినిమా జైలర్. ఆ తర్వాత రజినీకాంత్ నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. రిలీజైన కొద్ది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత వెంటనే జైలర్ డైరెక్టర్ తో జైలర్ -2 మొదలు పెట్టాలని రజనీ సిద్ధం అవుతున్నారు. అయితే ప్రారంభానికి ముందే రజనీ లుక్ రెడీ అయిపోయింది. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన తీరు, అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మ్యూజిక్.. రజినీ మార్క్ స్టైల్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది.
Read Also:Bollywood : 2024లో హారర్ కామెడీలతో సక్సెస్ కొట్టిన బాలీవుడ్
తాజాగా ఈ మూవీ చిత్రీకరణను మార్చిలో మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే, టీమ్ షూట్ కి సన్నాహాలు చేస్తున్నారు. మొదట రజనీకాంత్ పై యాక్షన్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్ ను వేస్తున్నారట. ఈ ‘జైలర్ 2’లో రజనీని తొలి భాగం కన్నా మరింత స్టైలిష్‌గా చూపించనున్నారని, అలాగే రజని లుక్ విషయంలో కూడా నెల్సన్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అన్నట్టు ‘జైలర్ 2’ చిత్రీకరణ గురించి త్వరలో అఫీషియల్ గా ప్రకటించనున్నారు. ఇక ఈ ‘జైలర్ 2’లో కూడా తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2 ను కూడా గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. టైగర్ కా హుకూమ్ అంటూ ‘జైలర్’లో హంగామా చేసిన రజనీకాంత్, జైలర్ 2లో ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి.
Read Also:DilRaju : 5 పాటలు రూ. 75 కోట్ల ఖర్చు.. శంకర్ మార్క్