Jailer 2 : మార్చిలో మొదలు పెట్టనున్న జైలర్ రెగ్యులర్ షూట్.. మరింత స్టైలిష్ గా రజినీ

  • త్వరలో ‘జైలర్‌ 2’ చిత్రీకరణ
  • కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన
  • ‘కూలీ’ సినిమాతో రజినీకాంత్ ప్రస్తుతం బిజీ

Jailer 2 : వరుస పరాజయాల తర్వాత సూపర్ స్టార్ తన స్టామినాను నిలబెట్టిన సినిమా జైలర్. ఆ తర్వాత రజినీకాంత్ న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. రిలీజైన కొద్ది రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ర‌జ‌నీకాంత్ ‘కూలీ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత వెంటనే జైల‌ర్ డైరెక్టర్ తో జైల‌ర్ -2 మొదలు పెట్టాలని ర‌జనీ సిద్ధం అవుతున్నారు. అయితే ప్రారంభానికి ముందే ర‌జ‌నీ లుక్ రెడీ అయిపోయింది. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన తీరు, అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మ్యూజిక్.. రజినీ మార్క్ స్టైల్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది.

Read Also:NagaVamsi : టికెట్ ధరలపై నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు

తాజాగా ఈ మూవీ చిత్రీకరణను మార్చిలో మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ‘జైలర్‌ 2’లో రజనీని తొలి భాగం కన్నా మరింత స్టైలిష్‌గా చూపించనున్నారని, అలాగే రజని లుక్ విషయంలో కూడా నెల్సన్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అన్నట్టు ‘జైలర్‌ 2’ చిత్రీకరణ గురించి త్వరలో అఫీషియల్ గా ప్రకటించనున్నారు. ఇక ఈ ‘జైలర్ 2’లో కూడా తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2 ను కూడా గ్రాండ్ గా నిర్మించబోతున్నారు.

అంతే కాకుండా ఈ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి వారు నటించారు. వారి పాత్రలు కూడా సాలిడ్ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేశాయి. మొదటి భాగంలో ఉన్న స్పెషల్ రోల్స్‌తో పాటు మరికొందరు స్టార్లను కూడా ‘జైలర్-2’లో చూపెట్టబోతున్నాడట నెల్సన్. అయితే, ఈ స్పెషల్ అట్రాక్షన్స్ ఎవరెవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మొదటి భాగంలో జైలర్ భార్యగా నటించిన రమ్యకృష్ణ పాత్రను ఈసారి వేరొకరు చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మరి వీటన్నింటికి సమాధానం దొరకాలంటే, జైలర్-2 మూవీ నుండి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read Also:Kishan Reddy : రికమెండేషన్లకు తలొగ్గకుండా నియామక పత్రాలు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *