War 2 : హృతిక్, ఎన్టీఆర్.. ‘వార్ 2’ పై ఫ్యాన్స్ లో కొత్త చర్చ షురూ

  • అంచనాలను మించిపోతున్న వార్ 2
  • త్వరగా రూ.1000కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్న సినిమా
  • షారూఖ్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం

War 2 : ప్రస్తుతం దేవర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దేవర తర్వాత టైగర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా.. ఎన్టీఆర్‌ కీలక షెడ్యూల్స్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు మరో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ పై పలు కీలక యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ హీరోల టాప్ డ్యాన్సర్ల లిస్ట్ తీస్తే.. ఎన్టీఆర్, హృతిక్ టాప్‌లో ఉంటారు. అలాంటి ఈ ఇద్దరు కలిసి మాస్ సాంగ్‌ అంటే.. థియేటర్లు తగలబడిపోవడం గ్యారెంటీ. వచ్చే ఏడాది ఆగష్టులో వార్2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. యశ్‌ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Read Also:Looting Bride: భార్యలను కోల్పోయిన వారే ఆమె టార్గెట్.. అందినకాడికి దోచుడే..

‘వార్ 2’ సినిమా పై నార్త్ లోనే కాదు.. సౌత్ లోనూ చాలా ఆసక్తిగా ఉన్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా రికార్డుల జాతర మోగించే అవకాశం ఉంది. దీనికితోడు ‘వార్ 2’ సినిమాకు సంబంధించి వచ్చిన రూమర్స్ అభిమానులు ఫుల్ జోష్ ని నింపుతున్నాయి. ఈ సినిమాకు నిర్మాత ఆదిత్య చోప్రా. ఒకప్పుడు తెలుగు సినిమాకి రూ.1000 కోట్లు కలెక్షన్స్ రావడం అంటే కష్టమే అనిపించేది. కానీ ప్రస్తుతం ఈ మార్క్ దాటడం కామన్ అయిపోయింది. ఇప్పటికే ‘పుష్ప 2’ సినిమా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాకి నార్త్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ సినిమా చాలా త్వరగా రూ.1000 కోట్ల మార్క్ ను అందుకుంటుందో అని నెటిజన్స్ చర్చించుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం అంతటి స్టామినా ఉన్న సినిమా ఏదంటే వార్ 2.

Read Also:Harish Rao : క్రిస్మస్‌ను అధికారికంగా నిర్వహించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌

పాన్ ఇండియా మల్టీస్టారర్స్ ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న ఈ ‘వార్ 2’ సినిమా పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్ లో ఎన్టీఆర్, నార్త్ లో హృతిక్ రోష‌న్‌ కారణంగా ఈ సినిమాకి ఎక్కడా లేని బజ్ ఉంది. కాబట్టి, హిందీలో ఆల్‌టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోందని అంచనాలు ఉన్నాయి. అలాగే, సౌత్ లో కూడా ముఖ్యంగా తెలుగులో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *