Published on Dec 8, 2024 7:00 AM IST
‘వార్ 2’ సినిమా పై సౌత్ లోనే కాదు.. నార్త్ లోనూ భారీగా ఆసక్తి ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా రికార్డుల జాతర మోగించే అవకాశం ఉంది. దీనికితోడు, ‘వార్ 2’ సినిమాకు సంబంధించి వచ్చిన రూమర్స్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని నింపుతున్నాయి. ఐతే, వచ్చే షెడ్యూల్ లో ‘వార్ 2’ క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో ‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’లతో పాటు మరో షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
ఏది ఏమైనా మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ఈ ‘వార్ 2’ సినిమా కూడా ఒకటి. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.