‘సంక్రాంతికి వస్తున్నాం’.. సంక్రాంతి రోజునే వస్తున్నాం! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉందని.. ఈ పాత్రలో ఓ యంగ్ హీరో కనిపిస్తాడని తెలుస్తోంది. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర చుట్టూ ఓ కామెడీ సీక్వెన్స్ నడుస్తోందని టాక్ నడుస్తోంది.

కాగా ముక్కోణపు క్రైమ్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్‌ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఆయన భార్యగా ఐశ్వర్య, మాజీ ప్రేయసిగా మీనాక్షి నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి అందిస్తున్నారు.

The post ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లైమాక్స్ లో గెస్ట్ రోల్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *