
“ఇస్మార్ట్ శంకర్” మూవీతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్, ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతోంది. తన గ్లామర్, అభినయం, సోషల్ మీడియా ఫాలోయింగ్‌తో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది.
ప్రస్తుతం నిధి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “హరి హర వీరమల్లు”, అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “రాజాసాబ్” చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు నిధి కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవ్వొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టాలీవుడ్‌లో వరుసగా వచ్చిన ప్లాప్‌ల వల్ల కెరీర్ స్లో అయినా, నిధి గ్లామర్ ఫోటోషూట్లతో ట్రెండింగ్‌లో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారేందుకు సిద్ధమవుతోంది.
తాజాగా తమిళ స్టార్ శింబుతో డేటింగ్ రూమర్లు వచ్చాయి. కానీ నిధి అగర్వాల్ వీటిపై క్లారిటీ ఇస్తూ, తన ఫోకస్ సినిమాలపైనే ఉందని తెలిపింది.
“హరి హర వీరమల్లు”, “రాజాసాబ్” హిట్స్ అయితే, నిధి టాప్ హీరోయిన్‌గా మారడం ఖాయం.