
నిధి అగర్వాల్.. బెంగుళూరులో జన్మించినా, హైదరాబాద్ లో పెరిగిన ఈ అందాల తార, తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. మోడలింగ్ రంగం నుండి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, అక్కినేని నాగచైతన్య సరసన సవ్యసాచి చిత్రంతో తెరంగేట్రం చేసింది.
అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా, నిధి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను లో నటించినా, పెద్దగా విజయం దక్కలేదు. కానీ, పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబోలో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో గ్లామరస్ లుక్‌తో అభిమానులను ఫిదా చేసింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు లో నటిస్తోంది. అంతేకాదు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ఇస్మార్ట్ శంకర్ తో అందరికీ దగ్గరైన నిధి, ఇప్పుడు పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ తో కలిసి నటించడం ఆమె కెరీర్ కు కొత్త ఊపునిస్తుందనడంలో సందేహం లేదు. ఈ రెండు సినిమాల తర్వాత నిధి క్రేజ్ అమాంతం పెరిగిపోనుంది.