ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ మూవీ రాజా సాబ్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. లేటెస్ట్ గా రాజా సాబ్ సెట్ లో జాయిన్ అయ్యింది నిధి అగర్వాల్. ఆమెకు సంబంధించిన సన్నివేశాలను తాజా షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు.

రాజా సాబ్ సినిమా ప్రభాస్ ఇప్పటిదాకా చేయని హారర్ జానర్ లో తెరకెక్కుతోంది. దర్శకుడు మారుతి ఈ జానర్ లో ఇప్పటికే సక్సెస్ ఫుల్ సినిమా ప్రేమ కథా చిత్రమ్ చేసి ఉన్నాడు. ప్రభాస్ ను కొత్తగా తెరపై చూపించే ఈ సినిమాలో హీరోయిన్స్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. నిధి అగర్వాల్ క్యారెక్టర్ లవ్ లీగా, గ్లామరస్ గా ఉండనుందని తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్ లోనే జాయిన్ అవుతారు.