
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రేజ్‌తో హీరోయిన్‌గా అడుగుపెట్టి ఒక మనసు సినిమాలో నాగశౌర్యతో కలిసి నటించింది. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించకపోయినా, నిహారిక నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. కానీ వరుస సినిమాలు చేసినా, ఆశించిన గుర్తింపు రాలేదు. దీంతో నటనకు పక్కనబట్టి, నిహారిక నిర్మాణ రంగాన్ని ఎంచుకుంది.
నిహారిక 2020లో చైతన్య జొన్నలగడ్డను పెద్దల అనుమతితో వివాహం చేసుకుంది. కానీ వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2023లో వీరు విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం నిహారిక పూర్తిగా కెరీర్‌పై దృష్టిపెట్టింది. నిర్మాతగా మారి కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకుంది. అయితే, నిహారిక రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా, నిహారిక ఇటీవల ఒక సరదా పోస్ట్ షేర్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ అంబటి భార్గవి కొడుకు రాసిన మాటల్ని పంచుకుంటూ, “Minor passport notebook. నేను అతడిని ప్రేమిస్తున్నాను. భార్గవి, మా ఫ్రెండ్‌షిప్ మధ్యకు రావద్దు, ఒకేనా? Thank you!” అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది, దీనిని చూసి నిహారిక ప్రేమలో పడిందంటూ రూమర్లు చెలరేగాయి.
ప్రస్తుతం నిహారిక సినిమాల నిర్మాణం, తన వ్యక్తిగత జీవితం రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన అభిప్రాయాలను, అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది.