2003లో విడుదలైన “సంబరం” సినిమాతో నటి నిఖిత తుక్రాల్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నితిన్ సరసన కథానాయికగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తన అందం, అభినయంతో ఆ సినిమాను మరో మెట్టుపైకి తీసుకెళ్లిన నిఖిత, ఆ వెంటనే మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా అనంతరం “కళ్యాణ రాముడు” చిత్రంలో వేణుతో కలిసి నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
పంజాబీ కుటుంబంలో జన్మించిన నిఖిత, 2002లో “హాయ్” సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు. తెలుగు మాత్రమే కాకుండా, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అనేక చిత్రాల్లో నటించారు. కథానాయికగా మాత్రమే కాకుండా, పాటల్లో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తన ప్రతిభను చాటారు. తెలుగు సినీ ప్రేమికుల మనసులో స్థానం సంపాదించిన నిఖిత, కన్నడ బిగ్ బాస్ సీజన్ 1లో రన్నరప్‌గా నిలిచారు.
తన కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలో నిఖిత, కన్నడ స్టార్ హీరో దర్శన్తో ప్రేమలో పడడం వివాదానికి దారితీసింది. దర్శన్ అప్పటికే వివాహితుడైనప్పటికీ, వారి ప్రేమ సంబంధం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న దర్శన్ భార్య, నిఖితకు వార్నింగ్ ఇచ్చిన ఘటన అప్పట్లో మీడియాలో వైరల్ అయింది.
నిఖిత తక్కువ సినిమాలు చేసినా, తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ప్రస్తుతం సినీ రంగంలో పెద్దగా కనిపించకపోయినా, ఆమె గత చిత్రాలు ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి.