- రాబిన్ హుడ్ రిలీజ్ పై వాడి వేడి డిస్కషన్స్
- క్రిస్మస్ కు రావాలని హీరో పట్టుదల
- ఫైనల్ వర్క్ ఇంకా పెండింగ్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ వర్క్ జరుగుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రాబిన్ హుడ్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల చేస్తామని ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో వెల్లడించారు మేకర్స్.
Also Read : NBK 109 : డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఇప్పడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై అనుమానాలు నెలకొన్నాయి. అందుకు కారణం పుష్ప -2 సుపర్ హిట్ కావడం. క్రిస్మస్ పబ్లిక్ హాలిడే కావడంతో ఆ రోజు పుష్ప 2 కు వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాంటప్పుడు పుష్ప ను థియేటర్స్ ను తీసి ఆ ప్లేస్ లో రాబిన్ హుడ్ ను వేయడం కరెక్ట్ కాదని నిర్మాతల ఉద్దేశం అన్నట్టు తెలుస్తోంది. ఇది ఒక వర్షన్ ఇక హీరో వర్షన్ మరోలా ఉంది. రాబిన్ హుడ్ ను ఎలాగైనా క్రిస్మస్ కు రిలీజ్ చేయాలనీ అవసరం అయితే నైజాం రైట్స్ తామే కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తామని అన్నారట. కానీ నిర్మాతలు అంత సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాబిన్ రిలీజ్ పై వాడి వేడి చర్చలు నడుస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా క్రిస్మస్ రిలీజ్ లేనట్టే అని అనుకోవాలి.