‘రాబిన్‌హుడ్’ షూటింగ్ అప్డేట్..! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 29, 2024 10:01 PM IST

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘రాబిన్‌హుడ్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన అప్డేట్ తాజాగా చిత్ర యూనిట్ తెలిపింది.

రాబిన్‌హుడ్ చిత్ర షూటింగ్‌లో మరో 2 సాంగ్స్, 6 రోజుల టాకీ పెండింగ్ ఉందని తెలుస్తోంది. ఈ మేరకు నితిన్, శ్రీలీల, వెంకీ కుడుముల ఉన్న వర్కింగ్ స్టిల్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఇక ఎంటర్‌టైనింగ్ అడ్వంచర్‌గా ‘రాబిన్‌హుడ్’ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. నవంబర్ మొదటి వారంలో ఈ చిత్ర టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *