
నటిగా రాణించడంతో పాటు క్రీడా రంగంలోనూ తన టాలెంట్ చూపిస్తోంది నివేదా పేతురాజ్. టాలీవుడ్లో “మెంటల్ మదిలో,” “బ్రోచేవారెవరురా,” “అల వైకుంఠపురము,” “రెడ్,” “పాగల్” వంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కానీ, ఆమె కేవలం నటిగానే కాదు, ఫార్ములా కార్ రేసింగ్ ట్రైనింగ్ తీసుకుంది. అంతేకాదు, ఇటీవల బ్యాడ్మింటన్ పోటీల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నటిగా, రేసర్‌గా, స్పోర్ట్స్ లవర్‌గా తన మల్టీ-టాలెంట్ చూపిస్తుంది.
తమిళనాడులో మధురైలో జన్మించిన నివేదా, దుబాయ్‌లో 10 సంవత్సరాలు చదువుకుంది. అక్కడే మోడలింగ్‌లో రాణించి Miss India UAE టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత “మెంటల్ మదిలో” సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.
అయితే, ఇప్పటి వరకు స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆమె, ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్స్‌ను చూసుకుంటోంది.