Published on Dec 15, 2024 12:03 PM IST
యంగ్ హీరోయిన్ నివేత థామస్ – యువ నటుడు విశ్వదేవ్ రాచకొండ కాంబినేషన్ లో దర్శకుడు ‘నంద కిషోర్ ఈమని’ తెరకెక్కించిన సినిమా “35 చిన్న కథ కాదు”. థియేటర్స్ సహా ఓటిటిలో కూడా సూపర్ హిట్ అయ్యిన ఈ సినిమా కొన్ని వారాల క్రితం 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించబడింది. తాజాగా ఈ చిత్రం ఇప్పుడు శాటిలైట్ ప్రీమియర్‌తో బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి రెడీ అవుతుంది.
“35 చిన్న కథ కాదు” చిత్రం డిసెంబర్ 22, 2024, మధ్యాహ్నం 3:00 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాబోతుంది. మరి ఈ ఫ్యామిలీ డ్రామా ఏ రేంజ్ లో టీఆర్పీని సాధిస్తోందో చూడాలి. కాగా ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్, అరుణదేవ్ పోతుల తదితరులు కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.