
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ అనే భారీ ప్రాజెక్ట్‌కు సిద్దమవుతున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో, ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అయితే, సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ముహూర్తం ఎప్పుడు? అనే విషయాలపై ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగా ఏమీ ప్రకటించలేదు. దీంతో, ఫ్యాన్స్ రకరకాల ఊహాగానాలకు ఆస్కారం కల్పిస్తున్నారు.
ఇటీవల, హాలీవుడ్ యాక్టర్ డాన్లీ వర్సెస్ ప్రభాస్ అనే ఫ్యాన్-మేడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, డాన్లీ నటించిన చిత్రాల నుండి క్లిప్స్ తీసి క్రియేటివ్ ఎడిటింగ్ చేయడం కొత్త కాదు. అయితే, ఈసారి డాన్లీ యాటిట్యూడ్‌ని ఎలివేట్ చేసే కట్స్, ప్రభాస్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మిక్స్ అవ్వడంతో, వీడియోలు మరింత హాట్ టాపిక్ గా మారాయి.
ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా “ప్రభాస్-అనుష్క పెళ్లి” పై ఫ్యాన్-మేడ్ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. వారికో పాప పుడితే, ఆ పాప ఎలా ఉంటుంది? అనే ఊహా దృశ్యాలను కలిపి రకరకాల క్రియేటివ్ క్లిప్పింగ్స్ రూపొందించారు. ఇక ఇప్పుడు స్పిరిట్ అప్‌డేట్ లేకపోవడంతో, అభిమానులు వేరే క్రియేటివ్ ట్రెండ్ పట్టారు.
సందీప్ రెడ్డి వంగా అప్‌డేట్ ఇచ్చే వరకు, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ రకమైన వీడియోలతో తమ ఊహాశక్తికి పని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ మాత్రం తన సినిమాలతో బిజీగా ఉంటూ, ఈ హడావిడిని ఫన్‌గా చూస్తున్నాడట!