ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ (19) కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఐతే, ఎన్టీఆర్ వీరాభిమాని అయిన తను చనిపోయేలోపు ‘దేవర’ చూడాలని కోరుకోవడం, సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్, కౌశిక్‌కు వీడియో కాల్ చేసి.. ఆరోగ్యం తర్వాతే సినిమా అని, త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ అతడికి ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే, సోమవారం.. మీడియా ముందుకొచ్చి కౌశిక్ తల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రూ.12 లక్షల బిల్లు కట్టి కౌశిక్ ప్రాణాన్ని కాపాడారు. ఈ విషయం కౌశిక్ తల్లి తాజాగా స్పందిస్తూ.. ‘ఎన్టీఆర్ గారు తన టీమ్ ను పంపి,
రూ.12 లక్షల బిల్లు కట్టి, మా బాబుని డిశ్చార్జ్ చేయించారు. మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నా కొడుకు ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. నిన్న నేను మాట్లాడిన మాటల వల్ల ఎన్టీఆర్ అభిమానులు ఫీలైనట్టున్నారు. మీరు అపార్థం చేసుకున్నారేమో. మీ అందరి ఆశీస్సుల వల్లే నా కొడుకు బాగున్నాడు’’ అని ఆమె చెప్పుకొచ్చింది.
The post అభిమాని ప్రాణాన్ని కాపాడిన ఎన్టీఆర్ ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.