‘ఎన్టీఆర్ – హృతిక్’ పై ఛేజింగ్ సీక్వెన్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings


ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘వార్-2’ కోసం నార్త్ ఆడియెన్స్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను యశ్ రాజ్ స్పై యూనివర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

అయితే, ఈ సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ స్ట్రెయిట్ ఎంట్రీ ఇస్తు్న్నాడు. దీంతో తారక్ అభిమానులు ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘వార్-2’ మూవీలో తారక్ ఎంట్రీ సీన్ గురించి తాజాగా బి-టౌన్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పైరేట్ తరహా థీమ్‌తో తారక్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.

ఈ సీక్వెన్స్‌లో భారీ యాక్షన్ డోస్ ఉండనుందని.. తారక్ చేసే స్టంట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో తారక్ ఫేస్ టు ఫేస్ సీన్స్ అయితే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించబోతున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను 2025 ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

The post ‘వార్-2’లో ఎన్టీఆర్ ఎంట్రీ సీక్వెన్స్ మామూలుగా ఉండదట! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *