‘వార్-2’ సర్‌ప్రైజ్ చేయబోతున్న ఎన్టీఆర్..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Jan 2, 2025 1:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘దేవర’ గ్రాండ్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, తాజాగా ఈ సినిమా యూనిట్‌తో ఎన్టీఆర్ ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది నెట్టింట వైరల్ అవుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ ఫోటోలో కనిపించారు. న్యూ ఇయర్ సందర్భంగా వారితో ఎన్టీఆర్ ఈ ఫోటో దిగాడు.

అంతేగాక, రవి బస్రూర్ పుట్టినరోజు కావడంతో ఈ కలయిక ప్రత్యేకంగా మారింది. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *