
టాలీవుడ్ మాస్ హీరో ఎన్టీఆర్, ‘దేవర’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో మరో ఘనవిజయంగా నిలిచింది. 550 కోట్ల రూపాయల వసూళ్లతో ‘దేవర’ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ విజయం అనంతరం, ఎన్టీఆర్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘దేవర’ రెండో భాగం త్వరలో విడుదల కానుండగా, బాలీవుడ్ లో ‘వార్ 2’లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
ఇక తాజా ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ తో ఎన్టీఆర్ మరో హై-వోల్టేజ్ యాక్షన్ సినిమా చేయనున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లను అందించిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాతో ఎన్టీఆర్ ను ఓ పవర్‌ఫుల్ పాత్రలో చూపించబోతున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తికరమైన అప్‌డేట్స్ వెలువడుతున్నాయి.
ప్రొడ్యూసర్ రవి శంకర్ మాట్లాడుతూ, ‘‘డ్రాగన్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతుంది. ఇది colossal, spectacular, thrilling, mesmerizing యాక్షన్ ఎంటర్‌టైనర్’’ అని పేర్కొన్నారు. ఆయన మాటలు ఎన్టీఆర్ అభిమానుల్లో మరింత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా టాలీవుడ్ లో ఒక సంచలనంగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్టీఆర్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ మాసివ్ డైరెక్షన్, మైత్రి మూవీ మేకర్స్ హై ప్రొడక్షన్ విలువలు కలిసిన ‘డ్రాగన్’ సినిమా, టాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించనుందని అంచనా. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.