సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల రూపాయల మార్క్ కు రీచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ ఎల్లుండి హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. ఇందుకు ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తాడని ఇప్పటికే తెలిసినా..ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

టిల్లు స్క్వేర్ సినిమా ఇవాళ్టికి 96 కోట్ల రూపాయల గ్రాస్ కు చేరుకుంది. రేపటి కల్లా వంద కోట్ల గ్రాసర్ గా మారుతుంది. సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఈ హండ్రెడ్ క్రోర్ గ్రాసర్ అనేది హైలైట్ కాబోతోంది. టిల్లు స్క్వేర్ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా..మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. టిల్లు 3 సినిమా కూడా అనౌన్స్ చేశారు.