NTR: ‘వార్-2’లో ఎన్టీఆర్ షూట్ చేసేది ముగింపేనా..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చూస్తూ దూసుకెళ్తున్న ‘దేవర’లో ఎన్టీఆర్ తన యాక్షన్‌తో ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేశాడు. ఇక ఈ సినిమా అందుకున్న భారీ సక్సెస్‌తో ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు.

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ స్పై యూనివర్స్ సీక్వెల్ మూవీ ‘వార్-2’లో ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో పాటు తారక్‌ను కలిసి బిగ్ స్క్రీన్‌పై చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో ‘వార్-2’ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే, ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, నెక్స్ట్ షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్‌ని ఈ షెడ్యూల్‌లో షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్-హృతిక్‌ల మధ్య జరిగే ఈ క్లైమాక్స్ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నవంబర్‌లో ఈ క్లైమాక్స్ షూట్ చేయనున్నారు. ఇక అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తు్న్నారు.

The post NTR: ‘వార్-2’లో ఎన్టీఆర్ షూట్ చేసేది ముగింపేనా..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *