ఎన్టీఆర్ తన ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ నటించనున్నారు. వార్ 2 సినిమాను యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తోంది. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. ఇప్పటికే వార్ 2 షూటింగ్ మొదలైంది. అయితే ఎన్టీఆర్ ఇంకా జాయిన్ కాలేదు. ఆయన ఎప్పటి నుంచి వార్ 2 సెట్ లో జాయిన్ అవుతున్నారు అనే విషయంలో క్లారిటీ వచ్చింది.

ఈ నెల మూడో వారం నుంచి ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కు హాజరుకానున్నారని తెలుస్తోంది. పది రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ చేయబోతున్నారు. వార్ 2లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ లో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ రూపొందిస్తున్నారు. ఈ దసరాకు దేవర 1 రిలీజ్ కానుంది.