స్ట్రాంగ్ కంటెంట్‌తో త్వరలోనే రిలీజ్ కానున్న ‘ఓ అందాల రాక్షసి’ మూవీ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 26, 2024 7:26 AM IST

దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం రాబోతోంది. ఓ అందమైన ప్రేమ కథా చిత్రంగా ఇది అందరినీ ఆకట్టుకోనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ షెరాజ్ మెహదీ మాట్లాడుతూ..‘ ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు భాష్యశ్రీ గారు కథ మాటలు, పాటలు రాశారు. అలాగే స్క్రీన్ ప్లేలో కూడా సపోర్ట్ చేశారు. ఆయన సహకారం వల్లే ఈ సినిమా ఇంత బాగా చేయగలిగాం. భాష్యశ్రీ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ‘ఓ అందాల రాక్షసి’ మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఒకరకంగా ఇది ఉమెన్ ఓరియెంటెడ్ మూవీ అనుకోవచ్చు. అమాయక మహిళలు కొందరి చేతిలో ఎలా మోసపోతున్నారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. అలాగే మోసం చేసేవారికి శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నాం. సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇంపార్టెంట్ రోల్స్‌లో నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే థియేటర్స్‌లో మిమ్మల్ని కలుస్తాం.’ అని అన్నారు.

రైటర్ భాష్య శ్రీ మాట్లాడుతూ.. ‘ ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు నేను కథ, మాటలు, పాటలు రాశాను. మా డైరెక్టర్, హీరో షెరాజ్ మెహదీకి థ్యాంక్స్ చెబుతున్నా. ఆయన డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ హీరోగానూ నటించారు. ఆయన వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. 45 రోజుల షూటింగ్‌తో టాకీ, సాంగ్స్ కంప్లీట్ చేసుకున్నాం. హైదరాబాద్, గోవా, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ ఇది. త్వరలోనే మీ ముందుకు మా ‘ఓ అందాల రాక్షసి’ సినిమాను తీసుకొస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా మూవీ నచ్చుతుంది.’ అని అన్నారు.

హీరోయిన్ విహాన్షి హెగ్డే మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ షెరాజ్ గారు ‘ఓ అందాల రాక్షసి’ కథ చెప్పినప్పుడు ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ముఖ్యంగా నా క్యారెక్టర్‌లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. ఇలాంటి క్యారెక్టర్‌లో అవకాశం ఇచ్చినందుకు షెరాజ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. కథలో కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ కూడా ఉంది. తెలుగు ప్రేక్షకులు ‘ఓ అందాల రాక్షసి’ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *