తెలుగు ప్రేక్షకులతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ ‘కల్కి’ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి మే 9నే ఈ సినిమా రిలీజ్ కావాల్సిఉంది. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘కల్కి’ విడుదల వాయిదా వేశారు.

ఇవాళ ఈ కొత్త తేదీని జూన్ 27గా ప్రకటించారు. వైజయంతీ మూవీస్ సంస్థ దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా..సైన్స్ ఫిక్షన్ మైథాలజీ కలిపిన కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి రూపొందిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూస్ చేస్తున్న బిగ్గెస్ట్ మూవీస్ లో కల్కి ఒకటి కానుంది. కల్కిలో దిశా పటానీ, దీపిక పడుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీ రోల్స్ చేస్తున్నారు. అటు ట్రేడ్ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ‘కల్కి’ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.