OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ వేవ్ భారీగా పెరిగిపోయింది. నిన్న ఎల్బీ స్టేడియంలో వపన్ కల్యాణ్ సందడి చేయడంతో సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. గతంలో ఎన్నడూ లేనట్టు పవన్ కల్యాణ్ సినిమా గెటప్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే పవన్ ఎప్పుడూ తెల్ల బట్టల్లో సింపుల్ గా వస్తుంటారు. కానీ సుజీత్ బలవంతం వల్లే ఇలా వచ్చానని పవన్ క్లారిటీ ఇచ్చుకున్నారు. కత్తి పట్టుకుని ఆయన చేసిన హంగామా ఫ్యాన్స్ ను ఊపేసింది. అయితే ఈవెంట్ లో పవన్ కల్యాణ్ బ్లాక్ డ్రెస్ తో పాటు మరొకటి ధరించి వచ్చాడు.
Read Also : Avika Gor : పెళ్లి పీటలు ఎక్కబోతున్న క్రేజీ హీరోయిన్
దాని గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. అదేంటో కాదు.. బంగారు జంధ్యం. ఇది పైకి కనిపించట్లేదు. కానీ జాగ్రత్తగా గమనిస్తే పవన్ కల్యాణ్ షర్టు లోపల క్లారిటీగా కనిపిస్తోంది. బంగారు జంధ్యం ఎందుకు వేసుకున్నాడనేదే ఇప్పుడు చర్చకు దారి తీసింది. అది సినిమా గెటప్ లో భాగం అని కొందరు అంటుంటే.. ఇంకొందరు మాత్రం సెంటిమెంట్ గా భావించి వేసుకున్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ దానిపై ఓజీ టీమ్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పవన్ కల్యాణ్ ఏం చేసినా ఓ సంచలనమే కదా.. అందుకే దీని గురించి కూడా ఇప్పుడు ఇలా చర్చ జరుగుతోంది.
Read Also : Bigg Boss 9 : మూడో వారం నామినేషన్స్ లో ఉన్నది వీరే..