- ఈ ఏడు కలిసిరాని వైనం
- మెగా ఫ్యామిలో ఇదే లాస్ట్ మూవీ
- హిట్ కొడితే ఆ విషయంలో ఫ్యాన్స్ ఖుషీ
OG : మెగా ఫ్యామిలీ అంటేనే టాలీవుడ్ లో అగ్ర కుటుంబం. ఆ ఫ్యామిలీ నుంచే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఒక ఏడాదిలో మెగా హీరోల సినిమాలు లేకుండా టాలీవుడ్ గడవదు. అయితే మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. సంక్రాంతికి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మూవీ గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయింది. ఆ సినిమా బాగా నిరుత్సాహం పెంచింది. దాని తర్వాత పవన్ కల్యాణ్ నుంచి చాలా కాలం తర్వాత జూన్ లో ఎన్నో అంచనాలతో వచ్చిన హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు పవన్ నుంచే ఓజీ సినిమా రాబోతోంది.
Read Also : OG : పవన్ కల్యాణ్ ఏం ధరించాడో గమనించారా..?
దీనిపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాతో ఈ ఏడు మెగా ఫ్యామిలీకి హిట్ లేని లోటును పవన్ తీరుస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మెగా హీరోల సినిమాలు ఏవీ ఈ ఏడు రావట్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఈ ఏడు ఇదే చివరి మూవీ. కాబట్టి ఓజీతో హిట్ కొట్టి మెగా ఫ్యామిలీకి సూపర్ ఎండ్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఓజీపై విపరీతమైన అంచనాలు పెరిగాయి. ఈ రోజు వచ్చిన ట్రైలర్ తో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ సినిమా గనక ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్ల ఊచకోత మామూలుగా ఉండదు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వస్తున్నందున సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి పవన్ ఈ సినిమాతో ఫ్యాన్స్ కోరిక తీరుస్తాడా లేదా అన్నది చూడాలి.
Read Also : Avika Gor : పెళ్లి పీటలు ఎక్కబోతున్న క్రేజీ హీరోయిన్