Published on Dec 28, 2024 11:00 PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘ఓజీ’ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కి్స్తుండగా పూర్తి గ్యాంగ్‌స్టర్ చిత్రంగా ఈ మూవీ మనముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది.
ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు పవన్‌కు సంబంధించిన ఎలాంటి సభ, ప్రెస్ మీట్ అయినా వదలడం లేదు. పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిలో హాజరయ్యే సభల్లోనూ అభిమానులు ఇదే విధంగా ప్రవర్తిస్తుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఓజీ మేకర్స్ కూడా తాజాగా రెస్పాండ్ అయ్యారు.
‘‘ఆయన్ని ఇబ్బంది పెట్టకండ్రా..’’ అంటూ వారు ఓజీ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఓజీ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నామని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానాన్ని, ఆయన స్థాయిని గౌరవించి మరికొన్ని రోజులు ఓపిక పట్టాలని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అభిమానులను కోరింది. 2025 లో ఓజీ పండగ చేసుకుందాం అని వారు అభిమానులకు పిలుపునిచ్చారు.