Published on Dec 10, 2024 3:00 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా పూర్తి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఈ మూవీపై హైప్‌ని పీక్స్‌లో కూర్చోబెట్టింది. అయితే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పలు షెడ్యూల్స్‌ను ముగించుకుంది. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్‌లో దర్శకుడు సుజిత్ ఫోటోను మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో సుజిత్ చాలా సీరియస్‌గా వర్క్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి షూటింగ్ జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.