Mon. Oct 13th, 2025
OG Trailer : వేట‌కు బెంగాల్ టైగ‌ర్.. OG ట్రైల‌ర్‌పై హీరో సాయి ధరమ్ తేజ్‌రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎఫ్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ట్రైలర్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్‌ను వీక్షించిన సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్(ధరమ్ తేజ్) తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన వేసిన పోస్ట్ అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read :Sree Vishnu: అక్టోబర్ 2న శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్

‘మేం ఇన్నాళ్లుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్ ఇప్పుడు వేటకు బయల్దేరింది..నాతో సహా ప్రతీ అభిమాని కోరిక తీర్చిన, అందరినీ సంతృప్తి పరిచిన సుజీత్ గారికి థాంక్స్.. ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు.. నా ప్రియ మిత్రుడు తమన్ ఇచ్చిన బీజీఎం అయితే నిజంగానే ఫైర్ స్ట్రామ్..నా హీరో, నా గురువు పవన్ కళ్యాణ్ మామయ్య ప్రతీ ఫ్రేమ్‌లో అద్భుతంగా కనిపించారు.. స్వాగ్, స్టైల్ ఇవన్నీ కూడా ఆయనకు తప్పా ఇంకెవ్వరికీ సాధ్యం కావు అన్నట్టుగా ఉంది.. ఓజీని మనమంతా కలిసి సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే’ అని ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Also Read :Avika Gor : పెళ్లి పీటలు ఎక్కబోతున్న క్రేజీ హీరోయిన్

ఓజీ ట్రైలర్‌ అయితే.. సుజిత్ చేసిన కట్స్, పవన్ కళ్యాణ్‌ స్టైలీష్‌, స్వాగ్‌‌ను మరో యాంగిల్‌లో చూపించడం, ఇక తమన్ బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్క విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 24న పెయిడ్ ప్రీమియర్లకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. సుజీత్ విజన్, థమన్ సంగీతం, పవన్ కళ్యాణ్ తిరుగులేని శక్తితో ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఒక పండుగ వాతావరణాన్ని తీసుకు వచ్చేలా ఉంది.