దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ‘ఓ వెన్నెల’ అనే సాంగ్‌ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు కానుకగా రీలీజ్ చేశారు.
ఈ పాటను న్యాచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. మంచి క్యాచీ ట్యూన్‌తో ఈ పాటను శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేశారు. ఈ పాటను బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్‌లపై చిత్రీకరించారు. కోనసీమ అందాలను ఈ పాటలో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక అనురాగ్ కుల్‌కర్ణి, యామిని ఘంటసాల ఈ పాటను చక్కగా పాడారు. రొమాంటిక్ సాంగ్‌గా వచ్చిన ‘ఓ వెన్నెల’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో ఆనంది దివ్య పిల్లై, జయసుధ, అజయ్, సంపత్ రాజ్, సందీప్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The post ‘భైరవం’ నుంచి ‘ఓ వెన్నెల’ సాంగ్ రిలీజ్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.