రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఆరెంజ్ సినిమా థియేటర్లలో భారీ విజయం సాధించకపోయినా, కాలక్రమంలో కల్ట్ క్లాసిక్ గా గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో రూబా పాత్రలో నటించిన షాజన్ పదంసీ ఆకట్టుకునే నటనతో మెప్పించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, బాలీవుడ్ సినిమా Rocket Singh: Salesman of the Year ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత ఆమె తమిళంలో కనిమొళి, హిందీలో దిల్ తో బచ్చా హై జీ, హౌస్‌ఫుల్ 2 వంటి చిత్రాల్లో నటించింది. తెలుగు ప్రేక్షకులకు ‘ఆరెంజ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె విక్టరీ వెంకటేష్, రామ్ పోతినేని నటించిన మసాలా చిత్రంలోనూ హీరోయిన్‌గా కనిపించింది. అయితే ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండింది.
2015లో సాలిడ్ పటేల్స్ అనే హిందీ చిత్రంలో కనిపించిన షాజన్ పదంసీ, దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత 2023లో పాగల్‌పన్: నెక్స్ట్ లెవల్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో పాటు కొన్ని web series లలోనూ నటిస్తోంది. ఇప్పుడు షాజన్ సినీ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగుతున్నదే కాక, వ్యక్తిగతంగా కూడా కొత్త దశలోకి అడుగుపెడుతోంది.
తాజాగా షాజన్ పదంసీ తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గతేడాది నవంబర్‌లో ఆశిష్ ప్రపోజ్ చేయగా, 2024 జనవరిలో వీరి రోకా వేడుక (Engagement Ceremony) జరగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూన్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.