Published on Dec 23, 2024 9:31 PM IST
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లుగా మార్చిన సినిమా ఏది అంటే డెఫినెట్ గా భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” అనే చెప్పాలి. మరి ఈ సినిమా గ్లోబల్ లెవెల్ ఫేమ్ ని తెచ్చుకోగా హీరోలతో పాటుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా గ్లోబల్ దర్శకుడు అయ్యారు.
అయితే ఈ సినిమా విషయంలో జరిగిన బ్యాక్ స్టోరీపై ఒక ఇంట్రెస్టింగ్ డాక్యు చిత్రాన్ని మేకర్స్ రీసెంట్ గానే రిలీజ్ కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ కొత్త వెర్షన్ ఇపుడు ఓటిటి డేట్ మరియు స్ట్రీమింగ్ పార్ట్నర్ ని లాక్ చేసుకుంది. అనుకున్నట్టుగానే ఈ కొత్త వెర్షన్ ని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. మరి ఇందులో ఈ డాక్యు చిత్రం ఈ డిసెంబర్ 27 నుంచి అందుబాటులోకి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి థియేటర్స్ లో మిస్ అయ్యినవారు అయితే ఈ కొన్ని రోజులు ఆగితే సరిపోతుంది అని చెప్పాలి.