Published on Dec 15, 2024 10:03 AM IST
సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జీబ్రా’. ఈ సినిమాను దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ మనీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కన్నడ నటుడు డాలీ ధనంజయ కూడా మరో లీడ్ రోల్‌లో నటించాడు. నవంబర్ 22, 2024న థియేటర్‌లలో విడుదలైంది, ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ 20, 2024న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ డిజిటల్ ప్రీమియర్ కోసం డేట్ ను టీమ్ రివీల్ చేశారు. అలాగే, గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వీక్షకులు 24 గంటల ముందే ఈ సినిమాని చూడొచ్చు.
మరి ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ బాగుంది. ముఖ్యంగా సత్యదేవ్, అతని పాత్ర చుట్టూ నడిచే మనీ రిలేటెడ్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇక సత్యదేవ్ – డాలీ ధనంజయ పాత్రలను లింక్ చేస్తూ దర్శకుడు రాసుకున్న సీన్స్ కూడా బాగున్నాయి. కాబట్టి, ఓటీటీలో మంచి హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.