ప్రస్తుతం మన తరచుగా పాన్ ఇండియా సినిమాలు పాన్ ఇండియా మార్కెట్, పాన్ ఇండియా రిలీజ్ లు అంటూ వినడం చాలా కామన్ అయ్యిపోయింది. అయితే ఒకప్పుడు పాన్ ఇండియా మార్కెట్ అంటే చాలా మందిలో ఒక భయం, భాద్యత ఉండేది. ఏవో కొన్ని సినిమాలు తప్పితే ఏ నిర్మాత కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు అనౌన్స్ చేసే సాహసం చెయ్యలేదు.
మరి అలా ఒక్క హీరో కోసం పుట్టిన కథతో పాన్ ఇండియా సినిమా గతినే మార్చేశాడు ఆ హీరో. మరి ఆ హీరోనే ప్రభాస్ కాగా తన కోసం పుట్టిన సినిమానే “బాహుబలి”. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ లు ప్రభాస్ కోసమే ఈ సినిమా చేశామని ప్రభాస్ లేనిదే బాహుబలి లేనట్టే అని అప్పట్లోనే పా ఇండియా మార్కెట్ కి ప్రభాస్ తో సాహసోపేత అడుగు వేశారు.
సీన్ కట్ చేస్తే ప్రభాస్ పేరిట కనీ వినీ ఎరుగని రికార్డులు సెట్టయ్యాయి. ఇక్కడ నుంచి పాన్ ఇండియా మార్కెట్ లో ప్రభాస్ పేరు ఒక బ్రాండ్ గా నిలిచిపోయింది. పాన్ ఇండియా నిర్మాతలు తనతో సినిమాలు చేసేందుకు, తన డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి అంతటి మార్కెట్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా వైపుగా దూసుకెళ్తున్నాడు.
ఇక ప్రభాస్ చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్స్ ప్రేక్షకుల్ని ఇంతలా ఆకర్షిస్తున్నాయని అనుకోవచ్చు. సలార్ లో ప్రభాస్ హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఆ కటౌట్ కు కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనుకున్నారు ఆడియెన్స్. అదీ స్క్రీన్ ప్రెజెన్స్ లో ప్రభాస్ కున్న ఛరిష్మా. బాహుబలి నుంచి పాన్ ఇండియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు.
1000 కోట్ల రూపాయల గ్రాస్ రీజనల్ స్టార్స్ కే కాదు ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఒక నెరవేరని కల, సాధ్యం కాని ఫీట్. కానీ ప్రభాస్ అలవోకగా బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో రెండు సార్లు థౌసండ్ క్రోర్ గ్రాస్ మూవీస్ చేశాడు. బాహుబలి 2 డే 1, 200 కోట్ల రూపాయలు వసూళు చేయడం ట్రేడ్ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ వెయ్యి రోజుల శ్రమ కలెక్షన్స్ రూపంలో రిజల్ట్ ఇచ్చింది. కల్కి 2898 ఏడి మూవీ 1100 కోట్ల రూపాయల గ్లోబల్ గ్రాస్ కలెక్షన్స్ చేయడం ప్రభాస్ రీసెంట్ గా క్రియేట్ చేసిన ఒక సెన్సేషన్. ప్రభాస్ బిగ్ హీరోనే కాదు బిగ్ టికెట్ హీరో అని ఈ బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేస్తున్నాయి.
ప్రభాస్ సినిమా అంటే ప్రొడ్యూసర్స్, ట్రేడ్ సెక్టార్ లో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఆయన సినిమాల మీద ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు, ఆ పెట్టుబడికి ప్రభాస్ స్టార్ డమ్, బాక్సాఫీస్ స్టామినానే పూచీ. అందుకే వందల కోట్ల రూపాయలతో బడ్జెట్ తో ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నాయి ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌసెస్. మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా…ప్రభాస్ చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్స్. వీటిలో ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. మిగతా మూవీస్ చిత్రీకరణలో వివిధ దశల్లో ఉన్నాయి.
ఇక ప్రభాస్ స్టార్ గానే కాదు వ్యక్తిగానూ అంతే గొప్పవారు. తనను ఇంత పెద్ద స్టార్ ను చేసిన అభిమానులు, ప్రేక్షకులంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే సొసైటీలో ఏ విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందిస్తుంటారు. మిగతా స్టార్స్ కంటే రెట్టింపు డొనేట్ చేస్తుంటారు. ఈ ఏడాది కేరళలో వనయాడ్ విలయానికి విపత్తు సాయంగా తన వంతు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రభాస్, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయలు విరాళం అందించారు. మరి రెబెల్ ఫ్యాన్స్ అంతా ఈ రోజు ప్రభాస్ బర్త్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. మరి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్న హీరో అంతకు మించిన పరిపూర్ణమైన మనిషి డార్లింగ్ ప్రభాస్ మీ అందరితో పాటు మా 123తెలుగు టీం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.