- 2007లో విడుదలైన హారర్ సినిమా
- ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల వసూళ్లు
2007లో హారర్ సినిమా విడుదలైంది. 6 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా లాభం చూసి ఫిలిం మేకర్స్ కు పిచ్చెక్కిపోయింది. 2021 సంవత్సరం వరకు దానికి 6 సీక్వెల్స్ చేశారు. ఈ సినిమా పేరు ‘పారానార్మల్ యాక్టివిటీ’. దీని దర్శకుడు, నిర్మాత ఓరెన్ పెలి. ఈ సినిమాకు కథ కూడా ఓరెన్ రాశారు. ప్రపంచంలోని హర్రర్ విభాగంలో అత్యధికంగా వీక్షించబడిన సినిమాల్లో ఇది ఒకటి.
READ MORE: Minister Kondapalli Srinivas: పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు
‘పారానార్మల్ యాక్టివిటీ’ విజయం తర్వాత, మేకర్స్ దాని సీక్వెల్ ప్లాన్ చేశారు. ఓరెన్ పెలి ‘పారానార్మల్ యాక్టివిటీ’కి 6 సీక్వెల్‌లు, స్పిన్‌ఆఫ్‌లను రూపొందించారు. ఈ సినిమా తొలి సీక్వెల్ 2010లో, రెండో సీక్వెల్ 2011లో, మూడో సీక్వెల్ 2012లో, నాలుగో సీక్వెల్ 2014లో, ఐదో సీక్వెల్ 2015లో, ఆరో సీక్వెల్ 2021 సంవత్సరంలో వచ్చింది. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. ఈ సినిమా బాక్సాఫీస్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా $193 మిలియన్లు వసూలు చేసింది. రూపాయల్లో అక్షరాల 800 కోట్లు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో కేవలం 4 మంది నటులు మాత్రమే ఉన్నారు. ఈ చిత్రం IMDbలో 10కి 6.3 రేటింగ్‌ను పొందింది.
READ MORE: PM Modi : రాజ్యంగం గురించి నెహ్రూ సీఎంలకు లేఖ రాశారు.. పార్లమెంట్‌లో మోడీ సంచలన వ్యాఖ్యలు