ఫ్యామిలీ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా పరశురామ్ కు పేరుంది. ఈ పేరును ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి నిలబెట్టుకున్నాడీ టాలెంటెడ్ డైరెక్టర్. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ రూపొందించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఫ్యామిలీస్టార్ ఫస్డ్ డే ఫస్ట్ షో నుంచి సకుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ మూవీ అని టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా కోసం థియేటర్స్ కు కదులుతున్నారు.

ఇటీవల కాలంలో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ రేంజ్ లో థియేటర్స్ కు రప్పించడం డైరెక్టర్ పరశురామ్ కే సాధ్యమైంది. కుటుంబ కథా చిత్రాల్లో తాను చేసే మ్యాజిక్ రిపీట్ చేశారు పరశురామ్. ఫ్యామిలీ స్టార్ లోని ఎమోషన్, ఫన్, హీరో క్యారెక్టరైజేషన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. గతంలో శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను ఇలాగే అందరికీ నచ్చేలా తెరకెక్కించారు డైరెక్టర్ పరశురామ్.