పలు తమిళ, మలయాళ సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది పార్వతీ తిరువోతు. ఆమె తన కెరీర్ లో చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ తంగలాన్. చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పార్వతీ గంగమ్మ అనే మహిళా రైతు పాత్రలో నటిస్తోంది. ఇవాళ పార్వతీ తిరువోతు పుట్టినరోజు సందర్భంగా తంగలాన్ నుంచి ఆమె గంగమ్మ క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో ఆమె పొలంలో ఎండిన పంటను కాలుస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తోంది. మాళవిక మోహనన్ తో కలిసి పార్వతీ తంగలాన్ లో హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు పా.రంజిత్ రూపొందిస్తున్న తంగలాన్ సినిమాను స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో తంగలాన్ థియేట్రికల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు.