రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘పతంగ్’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 15, 2024 7:41 AM IST

ఇప్పటి వరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్ష‌కులు చూసి ఉంటారు. కానీ అందరిలో ఎంతో మమేకమైన ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు.

చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాటలకు చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. డిసెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా ఉంటుంది. ఈ సినిమాకు క‌థే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుత‌మైన పాట‌లు ఇచ్చాడు. త‌ప్ప‌కుండా మా ప‌తంగ్ చిత్రం అన్నివ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది.’ అని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *