Pawan Kalyan: “ఎప్పుడు ఏ స్లోగన్‌ ఇవ్వాలో మీకు తెలియదు”.. అభిమానులపై పవన్ ఫైర్ (వీడియో)

  • అభిమానులపై అసహనం వ్యక్తం చేసిన పవన్
  • కడప రిమ్స్‌లో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం
  • భారీగా తరలి వచ్చిన అభిమానులు
  • ఓజీ సినిమాపై స్లోగన్లు
  • సీరియస్ అయిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎంపీడీవో, కుటుంబీకులను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పవన్ దాడి ఘటన గురించి మాట్లాడుతుండగా.. అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ‘ఓజీ.. ఓజీ.. ఓజీ’ అంటూ స్లోగన్లు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన.. ‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్‌ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం కొద్ది సేపు మౌనంగా ఉన్న పవన్ తర్వాత దాడి అంశంపై సీరియస్‌గా మాట్లాడారు.

READ MORE: Bank Holidays In January: 2025 జనవరిలో దాదాపు 15 రోజులు బ్యాంక్ సెలవులు..

ఇదిలా ఉండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధుల నిర్వహణలో చాలా బిజీగా ఉన్నారు. ఆయన చాలా రోజుల క్రితమే హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ అనే సినిమాలకు కమిట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక హరిహర వీరమల్లు సినిమాను మొదలు పెట్టిన తర్వాత భీమ్లా నాయక్, బ్రో అనే సినిమాలను మొదలు పెట్టి వాటిని పూర్తి చేసి విడుదల కూడా చేశాడు. ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని పవన్ మొదలు పెట్టి కూడా చాలా కాలమే అవుతోంది. వాటితో పాటే ఓజీ మూవీకి కూడా మూహూర్తం పెట్టి చాన్నాళ్లే అవుతుంది. ఇలా ఈ మూడు సినిమాలను మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ కావడంతో అవి కాస్త సైడ్ అయ్యాయి. ఈ సినిమాలను తెరపై చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *