పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు కూడా. అయితే ఈ చిత్రం షూట్ కి పవన్ ఇంకా కొన్ని రోజులే కేటాయించాల్సి ఉండగా ఈ సినిమాపై ఆల్రెడీ ఉన్న హైప్ ఇంకో లెవెల్ అంటే లేటెస్ట్ గా అది మరింత స్థాయిలోకి వెళ్ళింది అని చెప్పాలి.
లేటెస్ట్ గా జపాన్ మారియు థాయిలాండ్ కి చెందిన ప్రముఖ నటులు కొందరు సినిమాలో యాడ్ అవ్వడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనితో ఓ పక్క ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ సహా ఇలా ఇంటర్నేషనల్ గా జపాన్, థాయిలాండ్ లాంటి నేపథ్యాలు కూడా సుజీత్ ప్లాన్ చేస్తుండడంతో ఇపుడు ఓజి అంతకంతకు గ్రాండ్ గా మారుతూ వెళుతుంది అని చెప్పాలి. మరి ఈ సినిమాపై మున్ముందు వచ్చే డీటెయిల్స్ ఇంకెంత ఎగ్జైట్ చేస్తాయో చూడాలి.
The post అంతకంతకూ గ్రాండ్ గా మారుతున్న “ఓజి” first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.