Pawan Kalyan: చిరంజీవి ముసుగు కట్టుకొని సినిమా థియేటర్ కి వెళ్ళేవాడు!

పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. అల్లు అర్జున్ అంశంను గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారన్న ఆయన సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. అయితే అదే సమయంలో ఒకప్పుడు చిరంజీవి కూడా ఇలా రిలీజ్ రోజు సినిమాలకు వెళ్లేవారని కానీ ముఖానికి ముసుగు కట్టుకుని వెళ్లేవారని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని కెమెరాలు అన్నీ గమనిస్తున్నాయని అన్నారు. తానూ ఒక్కోసారి కళ్ళు మాత్రమే కనపడేలా వెళ్లినా గుర్తు పట్టేసే వారని ఆయన అన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించిందని.. సినిమా విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని పవన్‌ ప్రశంసించారు.

Pawan Kalyan: OG OG అని అరుస్తుంటే బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్‌ అరెస్టు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి గురించి మాట్లాడారు. ‘తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి గొప్ప నాయకుడు. కింది స్థాయి నుంచి ఎదిగారు. సీఎం రేవంత్‌ బెనిఫిట్‌షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్‌ ధర పెంపునకూ వెసులుబాటు కల్పించారు. సీఎం సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్‌ పూర్తిగా సహకరించారు. టికెట్‌ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అని కూడా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించింది. అల్లు అర్జున్‌ విషయంలో ముందు, వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను.. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టలేం. వారు ఎప్పుడూ భద్రత గురించే ఆలోచిస్తారు’ అని డిప్యూటీ సీఎం అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *