Pawan Kalyan: OG OG అని అరుస్తుంటే బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. తాజాగా అయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవ‌ల‌ కడప ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడుతుండ‌గా అభిమానులు ఓజీ.. ఓజీ.. ఓజీ.. సీఎం.. సీఎం అని పిల‌వ‌డం మొద‌లుపెట్టారు. దీంతో అసహనానికి గురైన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. అభిమానుల‌ను ఉద్దేశించి.. మీకు ఎక్కడ ఏం స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియకపోతే ఎలా అయ్యా.. ప‌క్క‌కి వెళ్లండి అంటూ ఇరిటేట్ అయ్యారు.

Game Changer: రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్.. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం

దీంతో దీనికి సంబంధించిన వీడియో ఫుల్ వైర‌ల్‌గా మారింది. అయితే ఈ విష‌యంపై తాజాగా మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన‌ ప్రెస్ మీట్‌లో స్పందించారు. ‘ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. OG అంటే.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. ‘OG OG’ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకొన్న అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చాను. వాళ్లే సరిగా సద్వినియోగం చేసుకోలేదు. ‘హరిహర వీరమల్లు’ మరో ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని చిత్రాలు పూర్తి చేస్తాను’’ అని ఆయన అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *