పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఉన్న హైప్, క్రేజ్ అసాధారణంగా ఉంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు.
గత ఆదివారం భారీ వర్షం కురుస్తున్నా, అభిమానులను నిరాశపరచకుండా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ పాల్గొన్నారు. OG లుక్‌లోనే అభిమానులను అలరిస్తూ, వారికి దగ్గరగా మాట్లాడుతూ ఉత్సాహపరిచారు. కానీ ఎక్కువసేపు వర్షంలో తడవడం వల్ల ఆయనకు వైరల్ జ్వరం వచ్చింది.
ఆరోగ్యం బాగోలేక పోయినా, పవన్ కళ్యాణ్ అమరావతిలో అసెంబ్లీ సెషన్లకు హాజరై, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జ్వరం మరింత పెరగడంతో వైద్యులు, పవన్‌కు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు.
The post ఓజీ రిలీజ్ ముందర పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.