Fri. Mar 27th, 2026
Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అంటే ఫ్యాన్స్‌కు పండుగే కానీ ఈసారి ‘పెద్ది’ సినిమా నుండి వచ్చిన ‘పెహల్వాన్’ గ్లింప్స్ అభిమానులను సంబరాలతో పాటు కాస్త అయోమయంలోకి కూడా నెట్టేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మధ్య ఒకటే చర్చ.. అసలు మన చెర్రీ ఏ క్రీడ నేపథ్యంలో మెప్పించబోతున్నాడు? అని దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. మొదటి గ్లింప్స్‌లో చెర్రీ పక్కా ‘క్రికెటర్’ లా కనిపించాడు, ‘చికిరి’ స్టెప్‌తో క్రికెట్ హుక్ స్టెప్ వేస్తూ అందరినీ ఇంప్రెస్ చేశాడు. అయితే, తాజాగా విడుదలైన సెకండ్ గ్లింప్స్ కథను మరో మలుపు తిప్పింది. ఇందులో చరణ్ గంభీరమైన ‘పెహల్వాన్’ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Additionally Learn:Allu Arjun: సరిహద్దులు దాటిన ‘రామ’ నామం.. జపాన్ దిగ్గజానికి అల్లు అర్జున్ అరుదైన కానుక!

ఈ రెండు భిన్నమైన గ్లింప్స్ రావడంతో, ఇది ఒకప్పటి భారతీయుల గర్వకారణం, లెజెండరీ యోధుడు ‘కోడి రామ్మూర్తి నాయుడు’ బయోపిక్ కావచ్చని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, బహుశా సినిమాలో హీరో ప్రయాణం క్రికెటర్ నుండి పెహల్వాన్‌గా మారుతుందా? లేక ఇవి రెండు వేర్వేరు షేడ్స్ ఉన్న పాత్రలా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై హైప్ మాత్రం స్కై హైకి చేరింది. ఇటీవల షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు కంటి దగ్గర చిన్న గాయం కావడం, సర్జరీ జరగడంతో సినిమా వాయిదా పడుతుందేమోనని కొందరు ఆందోళన చెందారు, చిరంజీవి కూడా వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేయడంతో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. కానీ, ‘పెహల్వాన్’ గ్లింప్స్‌తో నిర్మాతలే డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.